ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు ఆయన ఫాన్స్ విషెస్ చెప్పారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ మంద, కమెడియన్ ధనరాజ్ అలాగే ఎంతో మంది ఫేమస్ స్టార్స్ కూడా బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కౌశల్ బ్రహ్మానందం గారి ఫోటోను షేర్ చేసి "పద్మశ్రీ డా. బ్రహ్మానందం గారికి జన్మదిన శుభాకాంక్షలు ! ఈ సంవత్సరం మీకు సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మీ కెరీర్‌లో మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నాను " అన్నారు.
జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ ఫేమ్ ధనరాజ్ తన కుటుంబం మొత్తం బ్రహ్మానందం గారితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకుని ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ " నీకు మాత్రమే చెప్తా" డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తన రాబోయే తెలుగు మూవీ నుంచి బ్రహ్మానందం గారి ఫస్ట్ లుక్ ని పోస్ట్ చేసి విషెస్ చెప్పారు. "నీతోనే డ్యాన్స్ " షోతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కమెడియన్ వైవా హర్ష చెముడు కూడా బ్రహ్మానందం గారికి విషెస్ చెప్తూ ఫోటో షేర్ చేసాడు. ఇక కాపుగంటి బ్రహ్మానందం తెలుగు కామెడీకి పెట్టింది పేరు. ఆయన్ని కామెడీ గాడ్ గా ఆరాధిస్తారు అప్ కమింగ్ కమెడియన్స్. తెలుగు లెక్చరర్‌గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి తర్వాత అహ నా పెళ్లంట వంటి మూవీ తో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా.. ఖాళీ సమయాల్లో ఎన్నో వాల్ పెయింట్స్ వేసి వాళ్ళ ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు.